rajani: మురుగదాస్ తోనే రజనీ నెక్స్ట్ మూవీ

  • వరుస సినిమాలతో రజనీ 
  • సంక్రాంతికి 'పెట్టా' విడుదల 
  • రాజకీయాల నేపథ్యంలో సాగే మూవీ

యువ హీరోలను మించిన దూకుడుతో రజనీకాంత్ చకచకా సినిమాలు చేసేస్తున్నారు. 'కబాలి' సినిమా చేసిన ఆయన 'కాలా'గా ప్రేక్షకుల ముందుకు రావడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. 'కాలా'ను మరిచిపోకమునుపే, అంతకుముందు ఆయన చేసిన '2.ఓ' థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా సందడి థియేటర్లలో కొనసాగుతూ ఉండగానే, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన 'పెట్టా' సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమా తరువాత ఇక రజనీ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తారనే టాక్ వచ్చింది. కానీ ఆయన తన తదుపరి సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కథపై కసరత్తు పూర్తి చేసిన మురుగదాస్, ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశాడట. ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలోనే ఉంటుందనీ .. ప్రజలను ప్రభావితం చేసేలా ఉంటుందని అంటున్నారు. సన్ పిక్చర్స్ వారే ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని చెబుతున్నారు. 

rajani
murugadoss
  • Loading...

More Telugu News