nama nageswara rao: ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు: నామా నాగేశ్వరరావు

  • రేవంత్ అరెస్ట్ అప్రజాస్వామికం
  • కేసీఆర్ అరాచకపాలనకు ఈ సంఘటనే నిదర్శనం
  • రేవంత్ అరెస్ట్ పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడంపై టీడీపీ నేత నామా నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రేవంత్ అరెస్ట్ అప్రజాస్వామికమని, కేసీఆర్ అరాచకపాలనకు ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు. కేసీఆర్ పర్యటనను అడ్డుకోవాలన్న రేవంత్ ని అరెస్టు చేసిన పోలీసులు, మరి, ఖమ్మంలో చంద్రబాబును అడ్డుకోవాలని కేసీఆర్ పిలుపు నివ్వడంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రేవంత్ అరెస్ట్ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ప్రతిపక్షాలపై కేసీఆర్ కక్ష గట్టారు: కోదండరామ్

రేవంత్ ని అక్రమంగా అరెస్టు చేశారని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్  అన్నారు. ప్రతిపక్ష పార్టీలపై కేసీఆర్ కక్ష గట్టారని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ఈ సందర్భంగా కోదండరామ్ పిలుపు నిచ్చారు.

nama nageswara rao
kcr
Revanth Reddy
TRS
  • Loading...

More Telugu News