KCR: చంద్రబాబుకు మూడ్ వస్తే ప్రపంచమంతా తిరుగుతారు!: నందమూరి బాలకృష్ణ

  • ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో భారీ దోపిడీ
  • రైతు బంధు పథకంతో కౌలు రైతన్నలకు అన్యాయం
  • ఓల్డ్ బోయిన్ పల్లి సభలో మండిపడ్డ బాలయ్య

తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం భారీగా దోచుకుంటోందని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. ఈ రీ డిజైన్లతో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కౌలు రైతులను కేసీఆర్ అసలు రైతులుగానే పరిగణించడం లేదన్నారు. రైతు బంధు పథకం కింద వీరిని చేర్చడానికి కేసీఆర్ నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఓల్డ్ బోయిన్ పల్లిలో ఈ రోజు మహాకూటమి తరఫున బాలయ్య రోడ్ షో నిర్వహించారు.

అక్షరాస్యతలో తెలంగాణ దిగజారిపోయిందనీ, మద్యం అమ్మకాల్లో మాత్రం టాప్ గా నిలిచిందని బాలకృష్ణ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి 3 కిలోమీటర్లకు ఓ ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ఓ ఉన్నత పాఠశాలను స్థాపించామని గుర్తుచేశారు.

కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న స్కూళ్లనే మూసేస్తూ, ప్రజలకు మద్యం అలవాటు చేస్తూ..‘బాంచన్ దొర.. నీ కాళ్లు మొక్కుతా’ అనే పెత్తందారి సంస్కృతికి బీజం వేస్తోందని దుయ్యబట్టారు. హైటెక్ సిటీ వచ్చిందంటే, సైబరాబాద్ వచ్చిందటే, ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిందంటే చంద్రబాబు వల్లేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మూడ్ వస్తే ఊరుకోరనీ, రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రపంచమంతా తిరుగుతారని బాలయ్య చెప్పారు.

  • Loading...

More Telugu News