KCR: కేసీఆర్ సభకు వెళ్తా... సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ భార్య గీత!

  • భర్త అరెస్ట్ పై ఫిర్యాదుకు కదిలిన గీత
  • అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం
  • కేసీఆర్ సభకు వెళ్తానని ప్రకటన

తన భర్త అరెస్ట్ పై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి బయలుదేరిన వేళ, హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు అమెను అడ్డుకుని, ఈ సమయంలో బయటకు వెళితే, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చని ఆపారు. దీంతో గీత వారితో వాగ్వాదానికి దిగారు. తన భర్త ఎక్కడున్నారో చెప్పాలని నిలదీసిన ఆమె, 144వ సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతంలో కేసీఆర్ సభను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

దీనికి సమాధానం ఇచ్చిన పోలీసులు ఆ సభకు అన్ని రకాల అనుమతులూ ఉన్నాయని చెప్పారు. దీంతో తాను కూడా కేసీఆర్ సభకు వెళతానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. వారెంట్ లేకుండా అర్ధరాత్రి తన ఇంటి పడక గదిలోకి రావడాన్ని ప్రశ్నించిన ఆమె, పోలీసుల తీరుపై తనకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.

KCR
Revanth Reddy
Geeta
Kodangal
  • Loading...

More Telugu News