sundaram master: నేను చదువుకున్నది రెండవ తరగతే .. సంతకం చేయడం కూడా రాదు: డాన్స్ మాస్టర్ సుందరం

  • గొప్పదర్శకులతో కలిసి పనిచేశాను 
  • అగ్రహీరోలకి కొరియోగ్రఫీని అందించాను
  • నాకు ఒక్క ముక్క ఇంగ్లిష్ రాదు     

వందల సినిమాలకి కొరియోగ్రఫీని అందించిన అనుభవం సుందరం మాస్టర్ సొంతం. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన జీవితం తిరిగిన మలుపులను గురించి ప్రస్తావించారు."ఇంతవరకూ నేను 1200 సినిమాలకి పైగా కొరియోగ్రఫీని అందించాను. మణిరత్నం .. శంకర్ వంటి గొప్ప దర్శకుల సినిమాలకి పనిచేశాను. ఎన్టీఆర్ .. ఎంజీఆర్ .. నాగేశ్వరరావు తదితర హీరోలకి కొరియోగ్రఫీని అందించాను.

గొప్పగొప్ప వాళ్లతో కలిసి పనిచేశాను. వాళ్లు ఇంగ్లిష్ మాట్లాడేవారు .. నాకు ఒక్క ముక్క ఇంగ్లిష్ రాదు. ఇంగ్లిష్ లో సంతకం చేయడం కూడా నాకు రాదు. ఎందుకంటే నేను చదువుకున్నది .. రెండవ తరగతే. నాకు చదువురాదంటూ ఒక టీచర్ అన్న మాటలు చాలా బాధను కలిగించాయి. చదువుకుని వుంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకునేవాడిని. గొప్ప గొప్ప హీరోలకి కొరియోగ్రీఫీని అందించే అవకాశం అయితే వచ్చి ఉండేది కాదు గదా అని ఆ తరువాత అనిపించి ఆనందపడ్డాను" అని చెప్పుకొచ్చారు.    

  • Error fetching data: Network response was not ok

More Telugu News