Revanth Reddy: నా భర్త ఎక్కడ? ఇదేం ప్రజాస్వామ్యం?: రేవంత్ భార్య గీత

  • ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలి
  • 200 మంది కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు
  • రహస్య ప్రాంతానికి తీసుకెళ్లడం ఎందుకన్న గీత

తన భర్త ఎక్కడున్నాడో ప్రస్తుతం తెలియడం లేదని, ఆయన్ను అర్ధరాత్రి బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు, ఎక్కడికి తీసుకెళ్లారన్న విషయాన్ని వెంటనే చెప్పాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి భార్య గీత డిమాండ్‌ చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, తన భర్త, మరిదితో పాటు 20 మంది ముఖ్య అనుచరులను, మరో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. తన భర్తకు ప్రాణహాని ఉందని, ఆయన్ను ఎక్కడ ఉంచారన్న విషయాన్ని వెంటనే చెప్పాలని అన్నారు. తన భర్తను రహస్య ప్రాంతానికి తరలించడం ఏంటని, ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.

కాగా, కోస్గిలో నేడు కేసీఆర్ నిర్వహించనున్న సభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో, ముందస్తు చర్యల్లో భాగంగా రేవంత్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను శంషాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారని కొందరు, జడ్చర్ల సమీపంలోని పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ఉంచారని మరికొందరు అంటున్నారు. రేవంత్ అరెస్ట్ ను స్పష్టం చేసిన పోలీసు అధికారులు, ఆయన్ను ఎక్కడ ఉంచారన్న విషయమై మాత్రం అధికారిక ప్రకటన వెలువరించక పోవడం గమనార్హం.

Revanth Reddy
Geeta
Wife
Arrest
Kodangal
Police
  • Loading...

More Telugu News