Kamineni Srinivas: టీడీపీలో చేరడం లేదంటున్న బీజేపీ నేత కామినేని!

  • కామినేని బీజేపీని వీడుతున్నారంటూ వార్తలు
  • అటువంటిదేమీ లేదని స్పష్టీకరణ
  • ఇకపై పోటీ చేయబోనన్న కామినేని 

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించారు. తాను బీజేపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కామినేని తేల్చి చెప్పారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్న ఆయన మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు.

ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. చంద్రబాబునాయుడు కేబినెట్‌లో కామినేని ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు.  అయితే, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత ఏపీలోని బీజేపీ మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. కాగా, ఇకపై ఎన్నికల్లో పోటీ చేసేది లేదన్న కామినేని వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంశమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి మాత్రమే దూరంగా ఉంటున్నారా? లేక మొత్తం రాజకీయాల నుంచే దూరం కాబోతున్నారా? అన్న విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.

Kamineni Srinivas
BJP
Telugudesam
Andhra Pradesh
Chandrababu
  • Loading...

More Telugu News