Telangana: ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి.. ఆయన జాతకాల పిచ్చితోనే ముందస్తు ఎన్నికలు!: విజయశాంతి

  • డిసెంబర్ 11 తర్వాత తెలంగాణకు మంచిరోజులు
  • త్వరలోనే రాక్షస పాలన అంతమవుతుంది
  • కరీంనగర్ లోని సుల్తానాబాద్‌ లో రోడ్ షో

సీఎం కేసీఆర్ కు ఉన్న జాతకాల పిచ్చితోనే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి విమర్శించారు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం తెలంగాణ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో రాక్షస పాలన అంతమై కాంగ్రెస్ పాలన వస్తుందని జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్‌ లో ఈ రోజు జరిగిన రోడ్ షోలో విజయశాంతి మాట్లాడారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కేసీఆర్ కు కళ్లు నెత్తికి ఎక్కాయని విజయశాంతి విమర్శించారు. గత నాలుగేళ్లలో ఇచ్చిన ఏ హామీనీ కేసీఆర్ పూర్తి చేయలేదనీ, రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలను ఆయన మోసం చేశారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా యువతీయువకులు చేసిన త్యాగాల పునాదులపై కేసీఆర్ కూర్చుని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Telangana
KCR
Chief Minister
Congress
TRS
VIJAYASANTHI
Cheating
  • Loading...

More Telugu News