lagadapati: లగడపాటి సర్వే.. గెలిచే మూడో అభ్యర్థి ఇతనేనా?

  • చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు లగడపాటి ఫోన్
  • చిన్న వయసులోనే ప్రజాభిమానాన్ని చూరగొన్నావంటూ అభినందనలు
  • మూడో గెలుపుగుర్రం మేడిపల్లేనంటూ జోరుగా చర్చ

ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించే సర్వేలకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని... వీరిలో నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి, బోథ్ నుంచి అనిల్ కుమర్ జాదవ్ లు గెలుపొందుతారని ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి రోజు ఇద్దరు గెలుపు గుర్రాల పేర్లను వెల్లడిస్తానని చెప్పిన లగడపాటి... మేటర్ కాస్తా ఈసీ వరకు వెళ్లడంతో మౌనం వహించారు. తాజాగా ఓ వార్త చర్చనీయాంశంగా మారింది.

కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు లగడపాటి ఫోన్ చేశారట. చిన్న వయసులోనే ప్రజాభిమానాన్ని చూరగొన్నావని అభినందిస్తూ... తన సర్వే వివరాలతో పాటు సత్యంకు ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పారట. దీంతో, లగడపాటి సర్వేలో మూడో గెలుపు గుర్రం మేడిపల్లి సత్యమే అనే చర్చ జోరుగా సాగుంతోంది. మరో విషయం ఏమిటంటే... ఉద్యమకాలంలో లగడపాటి, మేడిపల్లి సత్యంలు హోరాహోరీ తలపడ్డారు. 

lagadapati
medipalli satyam
choppadandi
congress
survey
  • Loading...

More Telugu News