nagma: సనత్ నగర్ లో రోడ్ షో నిర్వహించిన నగ్మా

  • కూన వెంకటేష్ గౌడ తరపున ప్రచారం నిర్వహించిన నగ్మా
  • మహాకూటమి అధికారంలోకి వస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయన్న నగ్మా
  • టీఆర్ఎస్ కు మరో అవకాశం ఇవ్వవద్దు

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా ఈరోజు హైదరాబాదులో సందడి చేశారు. సనత్ నగర్ లో ఆమె రోడ్ షో నిర్వహించారు. ప్రజాకూటమి అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్ (టీడీపీ) తరపున ఆమె ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని, మహాకూటమి అధికారంలోకి వస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని
చెప్పారు. గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో భారీ అవినీతి చోటు చేసుకుందని విమర్శించారు. టీఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇవ్వరాదని విన్నవించారు. కూన వెంకటేష్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

nagma
sanath nagar
road show
kuna venkatesh
  • Loading...

More Telugu News