nagam janardhan reddy: నాగం జనార్దన్ రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు!

  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ నాగం పిటిషన్
  • ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలిపిన హైకోర్టు
  • పర్యావరణ శాఖ కూడా అనుమతులిచ్చిందంటూ వ్యాఖ్య

కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డికి ఇరు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు షాక్ ఇచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవకతవకలు జరిగాయంటూ ఆయన వేసిన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టి వేసింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఎత్తిపోతల పథకంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ధర్మాసనం తెలిపింది. ప్రాజెక్టులో అక్రమాలు జరగలేదని, పర్యావరణ శాఖ కూడా ప్రాజెక్టుకు అనుమతులను జారీ చేసిందని వెల్లడించింది. గత రెండు, మూడు వారాలుగా ఈ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఈరోజు హైకోర్టు తన తుది తీర్పును వెలురించింది. 

nagam janardhan reddy
congress
palamuru rangareddy
lift
project
High Court
  • Loading...

More Telugu News