rajani: యూఎస్ఏ లో రికార్డుల దిశగా దూసుకుపోతోన్న '2.ఓ'

  • 4 రోజుల్లోనే భారీ వసూళ్లు 
  • కొత్త రికార్డులు సృష్టిస్తోన్న '2.ఓ'
  • యూఎస్ఏలోను అదే జోరు  

రజనీకాంత్ కథానాయకుడిగా అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.ఓ' సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా యూఎస్ఏలోను ఈ సినిమా కొత్త రికార్డును నమోదు చేసే దిశగా పరుగులు తీస్తోంది. యూఎస్ఏ లో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన సౌత్ చిత్రాల జాబితాలో '2.ఓ' నాల్గో స్థానాన్ని దక్కించుకుంది.

తొలి వారాంతంలోనే ఈ సినిమా ఈ స్థానానికి చేరుకోవడం విశేషమని అంటున్నారు. యూఎస్ఏలో తొలి నాలుగు రోజుల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన 'రంగస్థలం'.. 'భరత్ అనే నేను' సినిమాల రికార్డులను ఈ సినిమా అధిగమించింది. 'కబాలి' పేరుతో వున్న రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన రజనీ తొలి చిత్రంగా ఈ సినిమానే నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనేది ట్రేడ్ విశ్లేషకుల మాట.   

  • Loading...

More Telugu News