Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కమల్ కోసం మేకప్ మారుస్తున్న కాజల్!
  • నాగశౌర్యకు జోడీగా నిధి అగర్వాల్ 
  • దిల్ రాజు సినిమాలో గోపీచంద్

*  కమల్, శంకర్ కాంబినేషన్లో రూపొందే 'భారతీయుడు 2' చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో ఆమె సరికొత్తగా కనిపిస్తుందట. అందుకోసం హెయిర్ స్టయిలింగ్, మేకప్ నిపుణులను అమెరికా నుంచి రప్పిస్తున్నట్టు సమాచారం.
*  ఇటీవల 'సవ్యసాచి' చిత్రంలో నటించిన నిధి అగర్వాల్ త్వరలో నాగశౌర్య సరసన నాయికగా నటించనుంది. దర్శకుడు సుకుమార్ నిర్మించే చిత్రంలో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తారని తెలుస్తోంది.
*  త్రిష కథానాయికగా ఇటీవల తమిళంలో వచ్చిన '96' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన కీలక పాత్రను తెలుగులో యాక్షన్ హీరో గోపీచంద్ పోషిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Kajal Agarwal
Kamal Haasan
nidhi Agarwal
trisha
  • Loading...

More Telugu News