Bageswar: పెళ్లి వేడుకలో విషాదం.. ముగ్గురి మృతి.. 250 మందికి అస్వస్థత

  • ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో పెళ్లి వేడుక
  • స్పందించిన ముఖ్యమంత్రి త్రివేద సింగ్
  • పెరుగు కలుషితమైనట్టు పోలీసుల వెల్లడి

ఎంతో సరదాగా.. ఆనందంగా మొదలైన పెళ్లి వేడుక విషాదాంతమైంది. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో ఓ పెళ్లి వేడుకలో ఫుడ్ పాయిజన్ కారణంగా ముగ్గురు చనిపోగా.. వధూవరులు సహా 250 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.ఈ విషయమై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి త్రివేద సింగ్ రావత్.. అస్వస్థతకు గురైన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని.. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఈ విషాద ఘటనపై నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విందులో వడ్డించిన పెరుగు కలుషితమైనట్టు తెలిసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి విచారణ నిర్వహిస్తున్నట్టు, చనిపోయిన వారిలో ఓ మహిళ, పదేళ్లలోపు ఇద్దరు పిల్లలున్నట్టు పోలీసులు చెప్పారు. బాధితులందరినీ బేరినాగ్, బాగేశ్వర్, అల్మోరా, కాప్‌కాట్, హల్ద్‌వానీ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించినట్టు పేర్కొన్నారు.

Bageswar
Uttarakhand
Triveda singh Ravath
Berinag
Almora
  • Error fetching data: Network response was not ok

More Telugu News