Nani: గర్ల్స్... ఇది మీ కోసమే: హీరో నాని!

  • 24వ చిత్రాన్ని ఎనౌన్స్ చేసిన నాని
  • ట్విట్టర్ లో తెలిపిన నాచురల్ స్టార్
  • వచ్చే సంవత్సరం వేసవికి సిద్ధం

నేచురల్‌ స్టార్‌ నాని తన 24వ చిత్రాన్ని ప్రకటించేస్తూ, 'అమ్మాయిలూ.... ఇది మీ కోసమే' అన్న క్యాప్షన్ పెడుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేశాడు. ‘హలో’ దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాని ఈ సినిమాను చేస్తుండగా, వారిద్దరూ ఓ గోడపై కూర్చుని మాట్లాడుకుంటున్న ఫోటోను పోస్టు చేశాడు నాని.

ఇంకా టైటిల్‌ ఖరారు కాని చిత్రంపై, "నేను, విక్రమ్‌ ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరంలో మీముందు రాబోతోంది. గర్ల్స్... ఇది మీకోసమే" అని క్యాప్షన్‌ పెట్టాడు. మైత్రిమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, వచ్చే సంవత్సరం వేసవికి సిద్ధం కానుంది. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, రెబా మోనికా జాన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, నాని తండ్రి, కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.



  • Error fetching data: Network response was not ok

More Telugu News