Balakrishna: గడీల పాలనను అంతం చేసింది టీడీపీయే!: బాలకృష్ణ

  • భవ్య అనంద ప్రసాద్ ను గెలిపించండి
  • గడీల పాలనను అంతం చేసిన తెలుగుదేశం
  • వివేకానందనగర్ రోడ్ షోలో బాలయ్య

తెలంగాణలో తెలుగుదేశం అభ్యర్థులందరినీ గెలిపించాలని, ప్రజా కూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా కుటుంబ పాలనకు చరమగీతం పలకాలని నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉదయం శేరిలింగంపల్లి పరిధిలోని వివేకానంద నగర్ లో భవ్య ఆనంద ప్రసాద్ గెలుపుకోసం రోడ్ షో నిర్వహించిన ఆయన, తనదైన శైలిలో ప్రసంగించారు.

 "సమాజ న్యాయం కోసం పోరాడింది తెలుగుదేశం పార్టీ. సమాజంలో అసమానతలను రూపు మాపేందుకు కృషి చేసింది. తెలుగుజాతి గౌరవాన్ని, ఉనికిని కాపాడింది. తెలుగు వారిలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం జెండాయే. గడీల పాలనను అంతం చేసింది కూడా ఈ పార్టీయే. తెలుగుదేశం జెండా ఎగరాలి తెలంగాణ నిండా" అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన పెద్దఎత్తున జరగాలంటే ప్రజా కూటమిని గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.

Balakrishna
Telangana
Elections
Road Show
Bhavya Anand Prasad
  • Loading...

More Telugu News