BJP: సరైన వ్యూహంతో వెళితే... మొత్తం సీట్లు జగన్ వే!: అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు

  • బీజేపీ, టీడీపీలకు ఒక్క సీటు కూడా రాదు
  • కాంగ్రెస్, బీజేపీలకు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ రాదు
  • సత్తా ఉన్న నేతలు చాలామందే ఉన్నారన్న అసదుద్దీన్

ఆంధ్రప్రదేశ్ కు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, సరైన వ్యూహంతో వెళితే, తెలుగుదేశం, బీజేపీలకు ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కుగానీ, బీజేపీకి గానీ సొంతంగా 280 సీట్లను గెలుచుకుంటాయన్న నమ్మకం తనకు లేదని అన్నారు.

దేశాన్ని నడిపించే సత్తా ఉన్న నేతలు కేవలం నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మాత్రమే కాదని, ఇంకా చాలామంది ఉన్నారని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డ ఆయన, బీజేపీకి ఏపీలో ఒక్క స్థానం కూడా రాదని జోస్యం చెప్పారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోమని కేసీఆర్, కేటీఆర్ లు స్పష్టం గా చెప్పడం వల్లే స్నేహపూర్వక పోటీకి అంగీకరించామని చెప్పారు. గులామ్ నబీ ఆజాద్ హైదరాబాద్ కు వచ్చి, ఇక్కడి వారిని కించపరిచేలా మాట్లాడారని, ఆయన కాంగ్రెస్ పార్టీకి గులాములా మారారని నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News