nandamuri balakrishna: తల్లి లాంటి పార్టీని మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పండి: నందమూరి బాలకృష్ణ

  • ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలి
  • హైదరాబాద్ ని తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబులదే 
  • ఎన్ని అవాంతరాలొచ్చినా విజయం ఖాయం

తల్లి లాంటి పార్టీని మోసం చేసిన వారికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సనత్ నగర్ లో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ప్రజాకూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడకుండా ఉన్న మహాకూటమి అభ్యర్థి వెంకటేశ్ గౌడ్ ను గెలిపించాలని కోరారు.

హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబులదేనని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు.. కేసీఆర్ లా కాదని, నిరంతరం అభివృద్ధికి పాటుపడే వ్యక్తి అని ప్రశంసించారు. చంద్రబాబు కట్టించిన భవనాల్లో మీటింగ్స్ పెట్టుకుంటున్న కేసీఆర్, ఆయన్నే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టీడీపీ జెండా ఎగరడం ఖాయమని, ప్రజాకూటమి అభ్యర్థులకు విజయం తథ్యమని బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పైనా ఆయన విమర్శలు చేశారు.     

nandamuri balakrishna
sanath nagar
Telugudesam
road show
  • Loading...

More Telugu News