Andhra Pradesh: సుజనాచౌదరి అవినీతి వ్యవహారంపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు?: ఆర్కే రోజా

  • ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి
  • లోకేశ్ కోసం బాబు హత్యా రాజకీయాలు
  • దమ్ముంటే జగన్ అవినీతిని నిరూపించాలి

ఆంధ్రాతో పాటు తెలంగాణను నాశనం చేయాలని బాబు, రాహుల్ గాంధీ చూస్తుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడకపోవడం దారుణమని రోజా విమర్శించారు. బ్యాంకులకు రూ.6,000 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనాచౌదరి గురించి పవన్ పల్లెత్తు మాట అనకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత కూడా జనసేనానికి లేదని స్పష్టం చేశారు. ఏలూరులో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు.

ఓ సాధారణ మహిళ దగ్గరి నుంచి  ప్రతిపక్ష నేత జగన్ మీద వరకు హత్యాయత్నాలు జరుగుతుంటే ఏపీలో శాంతిభద్రతలు ఎంతగా క్షీణించాయో అర్థం అవుతుందని విమర్శించారు. జగన్ పై దాడి జరిగితే చంద్రబాబు వెటకారంగా మాట్లాడారన్న రోజా.. ఇదే దాడి కొడుకు లోకేశ్ పై జరిగిఉంటే ఇలాగే స్పందించేవారా? అని సూటిగా ప్రశ్నించారు. లోకేశ్ కు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతోనే చంద్రబాబు హత్యా రాజకీయాలకు తెరతీశారని ఆరోపించారు.

‘మోదీ చేతిలో జగన్’ అంటూ ఓ దొంగ పత్రిక ఈ రోజు రాసిందనీ, నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగింది ఎవరో ప్రజలకు తెలుసని రోజా వ్యాఖ్యానించారు. కొందరు మీడియా మిత్రులు జర్నలిజాన్ని చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. దమ్ముంటే జగన్ అవినీతి చేసినట్లు నిరూపించాలని టీడీపీ నేతలకు సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News