jawahar: వేరే పార్టీల్లో అవకాశం దొరకని నేతలే జనసేనలోకి వెళ్తున్నారు: మంత్రి జవహర్

  • ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచే చిరంజీవి కుటుంబం చుట్టూ రావెల తిరుగుతున్నారు
  • మాదిగల సంక్షేమానికి ఆయన చేసిన కృషి ఏమిటి?
  • జనసేన కార్యాలయంలో గంగిరెద్దుల సందడి కనిపిస్తోంది

జనసేన పార్టీపై ఏపీ మంత్రి జవహర్ విమర్శలు గుప్పించారు. ఇతర పార్టీల్లో అవకాశం దొరకని నేతలకు జనసేన షెల్టర్ గా మారిందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేనలో చేరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచే చిరంజీవి కుటుంబం చుట్టూ రావెల కిషోర్ బాబు తిరుగుతున్నారని చెప్పారు. రావెల కుటుంబంపై గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించినప్పుడు ఆయన ఆత్మగౌరవం దెబ్బ తినలేదా? అని ప్రశ్నించారు. మాదిగల సంక్షేమానికి రావెల చేసిన కృషి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన కార్యాలయంలో ప్రస్తుతం గంగిరెద్దుల సందడి కనిపిస్తోందని అన్నారు. 

jawahar
Ravela Kishore Babu
chiranjeevi
pawan kalyan
janasena
Telugudesam
  • Loading...

More Telugu News