Congress: ప్రజాకూటమికి భారీ విజయం ఖాయం : కాంగ్రెస్‌ నేత బెల్లయ్యనాయక్‌

  • ఓటమి భయం వల్లే కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
  • రిజర్వేషన్‌ల పేరుతో గిరిజనులపైకి ఓట్ల వల
  • ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు పట్టం కట్టేది కూటమి అభ్యర్థులకే

ఓటమి భయంతో ఏదేదో మాట్లాడుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్ని ఫీట్లు చేసినా ప్రజలు పట్టం కట్టేది కూటమి అభ్యర్థులకేనని, ప్రజాకూటమి భారీ విజయం నమోదు చేయనుందని కాంగ్రెస్‌ నేత బెల్లయ్యనాయక్‌ స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్ల పేరుతో గిరిజనులపైకి కేసీఆర్‌ ఓట్ల వల విసురుతున్నారని విమర్శించారు. ప్రజాకూటమి అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిస్తుందని, ఎస్టీ రిజర్వేషన్‌ శాతం 10 శాతానికి పెంచుతామని తెలిపారు.

Congress
bellayyanayak
prajakutami
  • Loading...

More Telugu News