speaker kodela sivaprasad: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌

  • వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న సభాపతి
  • ఘన స్వాగతం పలికిన టీటీడీ అధికారులు
  • దర్శనానంతరం పండితుల వేదాశీర్వాదం

తిరుమలలో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం స్పీకర్‌కు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వాదం అందించారు. శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

speaker kodela sivaprasad
Tirumala
  • Loading...

More Telugu News