mohit raina: ‘మహాదేవ్’ నటుడు మోహిత్ రైనా కు తీవ్ర గాయం.. కంటికి కుట్లు వేసిన వైద్యులు!

  • షూటింగ్ సందర్భంగా గాయపడ్డ నటుడు
  • ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఘటన
  • తాను క్షేమంగా ఉన్నట్లు ప్రకటించిన రైనా

హిందీలో టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు, ‘దేవోంకీ దేవ్ మహాదేవ్’ సీరియల్ లో పరమ శివుడి పాత్ర పోషిస్తున్న మోహిత్ రైనా తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవల జరుగుతున్న ఓ షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, రైనా కంటికి గాయమయింది. వెంటనే చిత్రయూనిట్ ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చోటుచేసుకుంది.

ఈ విషయమై మోహిత్ రైనా మాట్లాడుతూ ‘మలీహాబాద్ ప్రాంతంలో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తుండగా నేను గాయపడ్డాను. నా కంటికి గాయమైంది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి చేరుకున్నాం. నన్ను పరీక్షించిన వైద్యులు, కంటి పైభాగంలో కుట్లు వేశారు. దేవుడి దయ వల్ల నా చూపు నిలిచింది. ఒక రోజు విశ్రాంతి తీసుకున్న తరువాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాను’ అని తెలిపాడు.

mohit raina
mahadev
actor
eye
injury
doctors
stitch
  • Loading...

More Telugu News