Yogi Adityanath: హనుమంతుడు గిరిజనుడే: యోగి వ్యాఖ్యలకు ఎస్టీ కమిషన్ మద్దతు

  • యోగి వ్యాఖ్యలకు మద్దతు
  • హనుమంతుడు దళిత గిరిజనుడు
  • రాముడికి గిరిజనులు సన్నిహిత సహాయకులు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు జాతీయ గిరిజన్ కమిషన్ నుంచి మద్దతు లభించింది. హనుమంతుడు దళిత గిరిజనుడంటూ యోగి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై నేడు జాతీయ గిరిజన కమిషన్ చైర్మెన్ నందకుమార్ సాయి మీడియాతో మాట్లాడుతూ హనుమంతుడు గిరిజనుడే అని తేల్చి చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో నందకుమార్ మాట్లాడుతూ.. గిరిజన కమ్యూనిటీలో హనుమాన్, వానర, గిద్ద, జతయు లాంటి అనేక ఉప కులాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాముడు వనవాసంలో ఉన్న సమయంలో ఆయనకు గిరిజనులు సన్నిహిత సహాయకులుగా మారారని స్పష్టం చేశారు. రావణాసురుడిపై రాముడు యుద్ధం చేయడానికి హనుమంతుడు సహా అడవి ప్రాంతంలో నివసించే గిరిజనులు సహాయపడ్డారని నందకుమార్ పేర్కొన్నారు.

Yogi Adityanath
ST commission
Nanda Kumar Sai
Hanuman
Rama
  • Loading...

More Telugu News