nandamuri suhasini: నందమూరి సుహాసిని కూకట్ పల్లిలో పోటీ చేస్తే తప్పేంటి?: సీపీఐ నేత నారాయణ

  • దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు
  • యూఎస్ లో చదివిన కేటీఆర్ కు ఆ మాత్రం తెలియదా?
  • కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించాలి

తెలంగాణలో అర్థాంతరంగా ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. టీ-టీడీపీ అభ్యర్థిగా కూకట్ పల్లి నుంచి నందమూరి సుహాసిని పోటీ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని అన్నారు. అమెరికాలో చదివిన కేటీఆర్ కు పోటీ చేసే అర్హతల గురించి తెలియదా? అని ప్రశ్నించారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా జగద్గిరిగుట్టలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించాలని, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే శ్రీశైలం గౌడ్ ను గెలిపించాలని కోరారు. అనంతరం, శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ బూటకపు వాగ్దానాల గురించి ప్రజలు ఆలోచించాలని, తెలంగాణ, సీమాంధ్ర వాళ్లందరూ ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు.

nandamuri suhasini
CPI Narayana
kukatpally
  • Loading...

More Telugu News