lagadapati raja gopal: లగడపాటి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు: కిషన్ రెడ్డి

  • లగడపాటి మాటలను మనం చర్చించుకోవాలా?
  • భవిష్యత్తు ఏమిటో అర్థంకాక ఆయనే అజ్ఞాతంలో ఉన్నారు
  •  మన భవిష్యత్తు ఆయన చెప్పేదేమిటి? 

రాజకీయాలను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పే జోస్యాలను తెలంగాణలో పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాజకీయాలపై ఆయన చెప్పే మాటలను మనం చర్చించుకోవాలా? అని ప్రశ్నించారు. తన భవిష్యత్తునే తేల్చుకోలేక అజ్ఞాతంలో ఉన్న రాజగోపాల్... తెలంగాణలో తమ భవిష్యత్తు గురించి చెప్పేదేమిటని ఆయన ఎద్దేవా చేశారు. తిరుమలలో లగడపాటి మాట్లాడుతూ, నారాయణపేట్, బోథ్ లలో ఇండిపెండెంట్లు గెలుస్తారని జోస్యం చెప్పిన సంగతి తేలిసిందే. 8 నుంచి 10 మంది స్వతంత్రులు గెలబోతున్నారంటూ ఎన్నికల వేడిని ఆయన మరింత పెంచారు. ఈ నేపథ్యంలోనే, లగడపాటిపై కిషన్ రెడ్డి పైవ్యాఖ్యలు చేశారు.

lagadapati raja gopal
kishan reddy
bjp
telangana
  • Loading...

More Telugu News