KTR: కేటీఆర్ సభ వద్ద నేరెళ్ల బాధితుల ఆత్మహత్యాయత్నం!

  • బర్తు బానయ్య, కోల హరీశ్, ఆత్మహత్యాయత్నం
  • కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయిన వైనం
  • రెండేళ్లు గడుస్తున్నా న్యాయం జరగలేదని నినాదాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లిలో మంత్రి కేటీఆర్ సభ వద్ద నేరెళ్ల బాధితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెండేళ్లు గడుస్తున్నా తమకు ఎలాంటి న్యాయం జరగకపోగా, తమపై పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. నేరెళ్ల బాధితులు బర్తు బానయ్య, కోల హరీశ్  ఆత్మహత్యకు యత్నించారు. తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధితులను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

KTR
TRS
siricilla
tangalla palli
nerella
  • Loading...

More Telugu News