Train: ఒక రైలును చూశాడు... మరొకటి కనిపించలేదు: రెప్పపాటులో తప్పిన మృత్యువు... వీడియో!

  • నెదర్లాండ్స్ లో ఘటన
  • వ్యతిరేక దిశలో వస్తున్న రైలును చూడకుండా దాటే ప్రయత్నం
  • తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడిన కుర్రాడు

మృత్యువు నుంచి రెప్పపాటు వ్యవధిలో తప్పించుకోవడం అంటే ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఉండదేమో. రైలు పట్టాలు దాటుతూ, తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ఓ కుర్రాడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెదర్లాండ్స్ లో ఈ ఘటన జరుగగా, సైకిల్ పై వచ్చిన కుర్రాడు రైల్వే గేటు వద్ద ఆగి చూశాడు. ఆ సమయంలో ఓ గూడ్స్ రైలు అటుగా వస్తుండటాన్ని చూసి ఆగాడు. అది వెళ్లిపోయిన తరువాత, బయలుదేరాడు. అదే సమయంలో వ్యతిరేక దిశలో మరో రైలు వేగంగా వస్తోంది. వెళుతున్న గూడ్స్ రైలుకు వెనుక అది ఉండటంతో దాన్ని గమనించలేదు. సైకిల్ పట్టాలెక్కిన తరువాత మాత్రమే రైలు కనిపించింది. వెంటనే అప్రమత్తమైన అతను సెకను వ్యవధిలో ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ఆ వీడియోను మీరూ చూడండి.

Train
Nedarlands
Track
  • Error fetching data: Network response was not ok

More Telugu News