Telangana: మహేందర్ రెడ్డి డీజీపీ అయ్యాక నాకు వేధింపులు ఎక్కువయ్యాయి.. ఎన్నికల ప్రచారాన్ని ఆపేస్తున్నా!: రేవంత్ రెడ్డి

  • నాకు ప్రాణహాని ఉందని చాలాసార్లు చెప్పాను
  • కోర్టు 4+4 రక్షణ కల్పించాలని ఆదేశించింది
  • అయినా కేంద్రం, రాష్ట్రం పట్టించుకోవడం లేదు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని 3 రోజుల పాటు రద్దు చేసుకున్నారు. తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి ప్రాంతాల్లో ఈ రోజు జరిగే ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొనాల్సి ఉంది. అయితే తనపై దాడులు జరగొచ్చన్న భయంతో 3 రోజుల పాటు తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

అంతేకాకుండా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిపై సైతం రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేందర్ రెడ్డి డీజీపీ అయ్యాక కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు తనకూ వేధింపులు పెరిగాయని ఆరోపించారు. తనకు 4 ప్లస్ 4 భద్రతను కల్పించాలని హైకోర్టు ఆదేశించినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తన పర్యటనలను పోలీసులు అడ్డుకుంటున్నారనీ, చివరి నిమిషం వరకూ అనుమతులు లేవని సాకులు చెబుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana
DGP
mahendar reddy
Revanth Reddy
Congress
tpcc president
stop
campign
attack
threat
  • Loading...

More Telugu News