ram mandir: అయోధ్యలో రామమందిరం కోసం ఆరెస్సెస్ రథయాత్ర.. రేపటి నుంచి ప్రారంభం!

  • 9 రోజుల పాటు సాగనున్న రథయాత్ర
  • బహిరంగ సభ నిర్వహించనున్న వీహెచ్ పీ
  • కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు హిందుత్వ సంస్థల వ్యూహం

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రామమందిరం నిర్మాణం డిమాండ్ ఊపందుకుంటోంది. ఇందుకోసం అయోధ్యలో మందిర నిర్మాణానికి హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చురుగ్గా పావులు కదుపుతోంది.

తాజాగా రేపటి నుంచి 9 రోజుల పాటు ఢిల్లీ నుంచి అయోధ్య వరకూ ‘సంకల్ప్ రథయాత్ర’ను నిర్వహించనున్నట్లు ఆరెస్సెస్ ప్రకటించింది. అయోధ్యపై దేశ ప్రజల్లో ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుందని వెల్లడించింది. కాగా, ఈ రథ యాత్ర ముగిసే డిసెంబర్ 9న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.

రామమందిరం-బాబ్రీ మసీదు కేసు విచారణను సుప్రీంకోర్టు 2019, జనవరికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మందిరాన్ని నిర్మించేందుకు వీలుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆరెస్సెస్, వీహెచ్ పీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.

ram mandir
ayodhya
New Delhi
Uttar Pradesh
RSS
Radha yatra
BJP
VHP
  • Loading...

More Telugu News