Talasani: కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం: తలసాని శ్రీనివాస్ యాదవ్

  • కేసీఆర్ సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయి
  • టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది
  • బలహీన వర్గాలు, మైనార్టీలకు అండగా నిలిచేది కేసీఆరే

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న తలసాని.... ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేలా కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు అండగా నిలిచేది కేసీఆరేనని చెప్పారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు టీఆర్ఎస్ ను బలపరిచి, ఓటు వేయాలని కోరారు.


Talasani
TRS
sanath nagar
kcr
  • Loading...

More Telugu News