ntr: రాజమౌళి మరో మేజిక్ డేట్ ఫిక్స్ చేశాడు .. ఆ రోజున మరో ప్రకటన!

  • షూటింగు దశలో రాజమౌళి మూవీ 
  • వచ్చేనెలలో వెలువడనున్న మరో ప్రకటన
  • కథానాయికలు ఎవరనే విషయంలో ఆసక్తి  

రాజమౌళి తన మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకుని, ఆ ప్రాజెక్టును లాంచ్ చేయడానికి 11-11-11 అనే మేజిక్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం నవంబర్ 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన ఈ సినిమాను లాంచ్ చేశారు. ఇక తాజాగా ఆయన మరో మేజిక్ డేట్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. 12-12-12 అనేది ఆ మేజిక్ డేట్.

ఆయన తన టీమ్ తో కలిసి ఈ మేజిక్ డేట్ ను సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని విషయాలను గురించి లాంచింగ్ రోజునే రాజమౌళి చెప్పేశారు. ఆ రోజున ఆయన ప్రస్తావించనిది కథానాయికలు ఎవరనేదే. అందువలన ఈ మేజిక్ డేట్ లో కథానాయికలు ఎవరనే విషయాన్ని ఆయన ప్రకటించవచ్చనే టాక్ వినిపిస్తోంది. నిజం చెప్పాలంటే ఆ విషయం తెలుసుకోవాలనే కుతూహలంతోనే అంతా వున్నారు. ఏ కథానాయికలను అదృష్టం వరించిందో చూడాలి మరి.       

  • Loading...

More Telugu News