Nayini Narsimha Redd: సిగ్గు లేదురా మీకు.. దమ్ముంటే ఒక్కొక్కరుగా రండిరా!: నాయిని నర్సింహారెడ్డి సవాల్

  • తెలంగాణ భవన్‌లో ఆశీర్వాద సభ
  • సభ పెట్టి మరీ తెలంగాణను అడ్డుకున్నారు
  • అప్పుడు ఒక్కడు కూడా రాలేదు

కాంగ్రెస్, టీడీపీ నేతలపై టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన ఆశీర్వాద సభలో నాయిని మాట్లాడుతూ.. ఓ బక్క పలచని వ్యక్తిని ఎదుర్కోవడానికి మోసగాళ్లంతా కూటమిగా వస్తున్నారని ధ్వజమెత్తారు.

 తెలంగాణ ఉద్యమంలో తాము లాఠీ దెబ్బలు తింటే పరామర్శించడానికి ఒక్కడు కూడా రాలేదని మండిపడ్డారు. పైగా తెలంగాణ ఇవ్వొద్దంటూ నిజాం కాలేజీలో సభ పెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడేమో ఓట్లు అడగడానికి వస్తున్నారని ‘సిగ్గులేదురా మీకు’’ అని కాంగ్రెస్, టీడీపీ నాయకులను ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ‘‘ఒక్కడిని ఎదుర్కోవడానికి కలిసి రావాలారా? దమ్ము లేదురా మీకు.. ఒక్కొక్కరుగా రండి’’ అని నాయిని  సవాలు విసిరారు.

Nayini Narsimha Redd
Telangana
Telugudesam
Congress
TRS
  • Loading...

More Telugu News