balka suman: నా బిడ్డ లాంటి వాడు బాల్క సుమన్.. ఆయన్ని గెలిపించండి: సీఎం కేసీఆర్

  • భారీ మెజార్టీతో బాల్క సుమన్ ని గెలిపించాలి
  • ఆయన్ని గెలిపిస్తే ఉన్నతమైన స్థానంలో ఉంటారు
  • నాడు ఉద్యమ సమయంలో పోరాడిన వ్యక్తి సుమన్

టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ గురించి సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందమర్రిలో ఈరోజు జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, బాల్క సుమన్ తనకు కొడుకు లాంటి వాడని, కేటీఆర్ ఎంతో సుమన్ కూడా తనకు అంతేనని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో నాడు విద్యార్థి నాయకుడిగా ఉన్న బాల్క సుమన్ పై ఉద్యమ సమయంలో వందలాది కేసులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు.

నాడు రెండు నెలల పాటు చంచల్ గూడ జైలులో ఉండి విడుదలై వచ్చిన సుమన్ ని ‘భయపడ్డావా?’ అని తాను ప్రశ్నిస్తే, ‘మీరుండగా నాకేం భయం సార్.. ఎంత వరకైనా పోతాను’ అంటూ పోరాడిన వ్యక్తి సుమన్ అని ప్రశంసించారు. ఎంపీ గా ఉన్న బాల్క సుమన్ ని చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకుంది తానేనని, అందుకే, బరిలోకి దింపుతున్నానని, భారీ మెజార్టీతో ఆయన్ని గెలిపించాలని కోరారు. బాల్క సుమన్ ని గెలిపిస్తే, ఉన్నతమైన స్థానంలో ఉంటారని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.  

balka suman
kcr
TRS
mandamarri
  • Loading...

More Telugu News