Karnataka Cm: కర్ణాటక సీఎం రాజీనామా అంటూ వార్తల ప్రసారం.. ఛానల్‌పై కేసు నమోదు

  • అనారోగ్యం కారణంగా రాజీనామా అని వార్తలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన జేడీఎస్
  • ఛానల్ ఎడిటర్, రిపోర్టర్‌పై కేసు నమోదు

కర్ణాటక సీఎం కుమారస్వామి రాజీనామా చేయబోతున్నారంటూ ఓ ఛానల్‌లో వార్తలు ప్రసారమవడం కర్ణాటకలో కలకలం రేపుతోంది. కుమారస్వామి అనారోగ్యం కారణంగా రాజీనామా చేయబోతున్నారని వార్తలు ప్రసారం చేసిన కన్నడ ఛానెల్‌పై జేడీఎస్ పార్టీ బెంగళూరు నగర అధ్యక్షుడు ఆర్. ప్రకాశ్ హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆయన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ.. రాజీనామా చేయబోతున్నారని పేర్కొంటూ.. రాష్ట్రంలో అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంగా కుమారస్వామి రోజుకు దాదాపు 16 గంటలు కష్టపడుతున్నారని పార్టీ పేర్కొంది. ప్రకాశ్ ఫిర్యాదు మేరకు సదరు ఛానల్‌ ఎడిటర్, రిపోర్టర్‌పై పోలీసులు సెక్షన్ 120బీ, 153, 505 కింద కేసు నమోదు చేశారు.

Karnataka Cm
Kumara Swamy
Kannada Channel
JDS
Prakash
  • Loading...

More Telugu News