Prem vallabh: ఢిల్లీలో పోలీస్ ప్రధాన కార్యాలయ భవనంపై నుంచి దూకి ఏసీపీ వల్లభ్ ఆత్మహత్య

  • మానసిక ఒత్తిడితో ఆత్మహత్య
  • 28 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స
  • 2016లో ఏసీపీగా పదోన్నతి

క్రైమ్, ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడటం సెంట్రల్ ఢిల్లీలో కలకలం రేపుతోంది. మానసిక ఒత్తిడిని భరించలేని ఏసీపీ ర్యాంకు అధికారి ప్రేమ్ వల్లభ్(55) పోలీస్ ప్రధాన కార్యాలయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా ఆయన 28 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారని ఆయన సహచర పోలీసు అధికారులు వెల్లడించారు. ఆయన ఆత్మహత్యకు కూడా ఇదే కారణంగా భావిస్తున్నారు. 1986లో హెడ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన వల్లభ్ 2016లో ఏసీపీగా పదోన్నతి పొందారు.

Prem vallabh
Crime
Traffic
Suiside
Head Constable
  • Loading...

More Telugu News