Jana Sena: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అమెరికా పర్యటన

  • అగ్రరాజ్యంలో మూడు రోజులపాటు గడపనున్న జనసేనాని
  • డిసెంబరు 14న డల్లాస్‌లో అక్కడి ఎన్‌ఆర్‌ఐలతో సమావేశం
  • గతంలోనూ ఒకసారి ఎన్‌ఆర్‌ఐలతో భేటీ

ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా తన సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించి అక్కడి ఎన్‌ఆర్‌ఐలతో భేటీ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే  రాష్ట్రంలో వరుస భేటీలు, యాత్రలు, పోరాటాలతో బిజీగా ఉన్న జనసేనాని అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. గతంలోనూ ఒకసారి అమెరికాలో పర్యటించి అక్కడి ఎన్‌ఆర్‌ఐలతో భేటీ అయిన పవన్‌కల్యాణ్‌ డిసెంబరు 14న మరోసారి వారితో భేటీకావాలని నిర్ణయించారు. ఇందుకోసం డల్లాస్‌ వేదికగా ప్రత్యేక కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Jana Sena
Pawan Kalyan
america tour
  • Loading...

More Telugu News