girl herashed: స్నేహితురాలు మాట్లాడం మానేసిందని కక్ష... ఫోన్, సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు

  • స్నేహితుడి వైఖరి నచ్చక యువతి దూరం పెట్టడంతో ఆక్రోశం
  • బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్టు
  • నిందితుడు కడప జిల్లాకు చెందినా వ్యక్తి

సహ విద్యార్థులు ఇద్దరూ కొన్నాళ్లు స్నేహంగా మెలిగారు. తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. కాలక్రమంలో స్నేహితుడి తీరు నచ్చని యువతి అతన్ని దూరం పెట్టింది. దీంతో ఆగ్రహించిన సదరు ప్రేమికుడు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో కటకటాలపాయ్యాడు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ హరినాథ్‌ కథనం మేరకు వివరాలిలావున్నాయి.

కడప జిల్లా సిద్ధవటం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మచ్చసిద్ధ గోపాల్‌ (26) సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంట్‌ (సీఎంఏ) శిక్షణ కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చాడు. సహ విద్యార్థినితో అతనికి స్నేహం పెరిగింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. శిక్షణ ముగిశాక మలక్‌పేటలో గోపాల్‌ మకాం పెట్టాడు. ఈలోగా స్నేహితుడి వైఖరి నచ్చక అక్టోబర్‌ నుంచి స్నేహితురాలు ఫోన్‌ చేయడం మానేసింది.

దీంతో మనస్తాపానికి గురైన గోపాల్‌ నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. ఆ సమయంలో యువతి సోదరుడు, మరికొందరు గోపాల్‌ను అడ్డుకుని గట్టిగా హెచ్చరించడంతో వచ్చేశాడు. ఈ సంఘటన అనంతరం స్నేహితురాలిపై కక్ష పెంచుకున్న గోపాల్‌ తరచూ ఆమెకు ఫోన్‌చేసి తనను కలవకుంటే అంతుచూస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. పరువు తీస్తానంటూ ఫేస్‌బుక్‌, సామాజిక మాధ్యమాల్లోనూ హెచ్చరించాడు. ఆమె సోదరుడికి కూడా అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పంపేవాడు. ఈ వేధింపులు భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్టుచేసి కటకటాల వెనక్కి పంపారు.

  • Loading...

More Telugu News