DK Aruna: మీకు తెలుసా?... నా అసలు పేరు అరుంధతి!: డీకే అరుణ

  • గద్వాల సంస్థానంతో సంబంధం లేదు
  • అరుంధతి అని పేరు పెడితే అరుణగా స్థిరపడిపోయింది
  • ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం ఖాయమని ధీమా

తన అసలు పేరు అరుంధతి అని, కానీ చిన్నప్పటి నుంచి అందరూ అరుణ అని పిలుస్తూ ఉండటంతో ఆ పేరే వాడుకలోకి వచ్చిందని గద్వాల నుంచి ప్రజా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ప్రచారానికి బయలుదేరిన ఆమె, గద్వాల సంస్థానానికి తమ కుటుంబానికి సంబంధం లేదని చెబుతూనే, సూపర్ హిట్ చిత్రం 'అరుంధతి'ని గుర్తు చేసుకుంటూ తన పేరు అరుంధతి కావడం యాదృచ్చికమేనని అన్నారు.

ఓటర్ల జాబితాలో తన పేరు పక్కనే 'అలియాస్ అరుంధతి' అని ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు తనను సొంత బిడ్డలా చూసుకుంటారని, ఈ ఎన్నికల్లో గద్వాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా స్థానాలను ప్రజా కూటమి గెలుచుకుంటుందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని స్థానాలనూ గెలుచుకుని తీరుతామన్న ధీమాను వ్యక్తం చేశారు.

DK Aruna
Gadwal
Praja Kutami
Telangana
Elections
  • Loading...

More Telugu News