Krishna District: నూజివీడు ట్రిపుల్ ఐటీ భవంతిపై నుంచి దూకిన విద్యార్థిని సుష్మా పావని!

  • ఫస్టియర్ చదువుతున్న సుష్మా పావని
  • హాస్టల్ భవంతిపై నుంచి దూకిన పావని
  • పరిస్థితి విషమం

కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఫస్టియర్ చదువుతున్న బోడు సుష్మా పావని అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆమె తాను బస చేసే హాస్టల్ భవంతిపై నుంచి కిందకు దూకింది. విషయం గుర్తించిన సహచర విద్యార్థినులు ఆసుపత్రికి తరలించారు.

ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు పంపినట్టు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం వెల్లడించింది. వరంగల్ జిల్లా గూడూరు మండలం గుండెగ గ్రామానికి చెందిన పావని, చదువు ఒత్తిడి వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, వివరాలు సేకరించారు.

Krishna District
Nuzivedu
IIIT
Sucide Attempt
  • Loading...

More Telugu News