Gujarath: డ్యాన్స్ చేస్తానంటూ పిలిచి, ప్లాన్ ప్రకారం మోసం చేస్తున్న గుజరాతీ నటి... అరెస్ట్!

  • ఏకాంత నృత్య ప్రదర్శనలకు ఆహ్వానించే సంజన
  • తొలుత స్నేహం, ఆపై మోసం
  • సహకరిస్తున్న స్నేహితుడు మోయిన్ అలీ
  • అరెస్ట్ చేసిన తరువాత పోలీసులకు బెదిరింపులు

తన నృత్య ప్రదర్శన ఉందని, దానికి రావాలని డబ్బున్న వారికి ఆహ్వానం పంపుతూ, ఆపై వారితో స్నేహం ప్రారంభించి, ఓ పథకం ప్రకారం తన స్నేహితుడితో కలసి మోసం చేస్తున్న గుజరాతీ అల్బమ్ నటి సంజనా ఉరఫ్ సంజూ దుర్గష్ బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, భర్త సంజయ్ కి దూరంగా ఉంటున్న సంజనా, మోయిన్ అలీ సయ్యద్ అనే యువకుడికి దగ్గరైంది. రమోల్ ప్రాంతంలో ఉంటున్న ఆమె, ఏకాంతంగా నృత్య ప్రదర్శనలు ఇస్తానని పలువురికి ఆహ్వానాలు పంపుతుంటుంది. ఆశపడి వచ్చిన వారిని బుట్టలో వేసుకుంటుంది. ఈమె మోసాలపై మూడు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి ఆమెను, ఆమెకు సహకరిస్తున్న మోయిన్ అలీని అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్ట్ చేసిన తరువాత, పోలీసులను ఆమె బెదిరించినట్టు తెలుస్తోంది. తన న్యూడ్ వీడియోలను బయటకు వదులుతానని ఆమె బెదిరించినట్టు సమాచారం.

Gujarath
Sanjana
Album Actor
Fruad
Dance
  • Loading...

More Telugu News