Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. యువకుడి నరికివేత

  • సహచర ఆటో డ్రైవర్‌ను నరికి చంపిన నిందితుడు
  • అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను కత్తితో బెదిరించిన వైనం
  • పోలీసుల అదుపులో హంతకుడు

హైదరాబాద్ పాతబస్తీలో బుధవారం రాత్రి దారుణం జరిగింది. నయాపూల్ వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆటో డ్రైవర్ అయిన అబ్దుల్ సహచర ఆటో డ్రైవర్‌ అయిన షకీబ్ ఖురేషీని అందరూ చూస్తుండగానే కత్తితో నరికి చంపాడు. పాతబస్తీలో ఉంటూ ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్న ఖురేషీ.. అబ్దుల్ కుటుంబ సభ్యులతో అసభ్యంగా మాట్లాడడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.

 అబ్దుల్ దారుణానికి పాల్పడుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కత్తితో బెదిరించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి  చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Old city
Nayapool
Murder
Auto driver
Crime News
  • Loading...

More Telugu News