Pawan Kalyan: మహిళలు రాజకీయాలలోకి రాకపోతే.. చంద్రబాబు, జగన్ లాంటివారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు: పవన్

  • విలువ‌లు పాటించి.. సమస్యలపై స్పందించేవారు నిజమైన మ‌హిళా నాయ‌కులు
  • బూతులు తిడుతూ నోరేసుకుపడిపోయేవారు కాదు
  • డ్వాక్రా మహిళల మీటింగ్ లో పవన్

ఒక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగినపుడు, రామ మందిరం కోసం ఉద్యమాలు జరిగినపుడు, జన్మనిచ్చిన తల్లుల రిజర్వేషన్ కోసం ఎందుకు పోరాటం చేయరని జనసేన అధినేత పవన్ ఈరోజు అమలాపురంలో జరిగిన డ్వాక్రా మహిళల మీటింగ్ లో ప్రశ్నించారు. విలువలు, బాధ్యతతో కూడిన ఆడపడుచులు రాజకీయాల్లోకి రాకపోతే సమాజం అవినీతిమయం అయిపోతుందని.. చంద్రబాబు, జగన్, లోకేష్ వంటివాళ్లు పెరిగిపోయి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తారని హెచ్చరించారు. అందుకే మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్ కోసం జనసేన పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.

జన్మనిచ్చే ఆడవాళ్లు సాక్షాత్తు దైవసమానులు, అలాంటి ఆడపడుచులకు సరైన గౌరవం ఇవ్వకపోతే సమాజం విచ్చిన్నం అయిపోతుంది. బూతులు తిట్టేవారు, నోరేసుకుని పడిపోయేవారు మహిళా నాయకులు కాదు, విలువలు మాట్లాడేవారు, సమస్యలు అర్థం చేసుకునేవాళ్లు మహిళా నాయకులు. మగవాళ్ల ఆధిపత్యంలో రాజకీయాలు అవినీతిమయమైపోయాయి. జనసేన పార్టీ తరపున విలువలు, బాధ్యతతో కూడిన ఆడపడుచులను రాజకీయాలలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా పవన్ అన్నారు.

  • Loading...

More Telugu News