Andhra Pradesh: దారిన పోతున్న శనిని నెత్తికెక్కించుకున్న చంద్రబాబు: జీవీఎల్

  • ఆంధ్రకు అన్యాయం చేసిన కాంగ్రెస్ చెంత చేరుతారా?
  • టీడీపీ చేస్తున్నది నయ వంచన
  • చంద్రబాబు లక్ష్యంగా జీవీఎల్ విసుర్లు

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు లక్ష్యంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, దారిన పోతున్న శని వంటి కాంగ్రెస్ ను నెత్తికి ఎక్కించుకున్న చంద్రబాబుకు ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు.

"ఊరందరిదీ ఒక దోవ, ఉలిపిరి కట్టెది ఒకదోవ అనేలా ఉంది చంద్రబాబుగారి తీరు. 'కాంగ్రెస్ ముక్త్ (లేని) భారత్' కావాలని దేశం అంతా కోరుకుంటుంటే, ఆంధ్రకు అన్యాయం చేసిన కాంగ్రెస్ చెంతన చేరిన తెలుగుదేశం చేస్తున్నది నయ వంచన. దారినిపోయే శనీశ్వరాన్ని పిలిచి పీట వేస్తున్న టీడీపీకి దారుణ ఓటమి తప్పదు" అని ఆయన అన్నారు.

Andhra Pradesh
GVL
Congress
Telugudesam
Chandrababu
Twitter
  • Loading...

More Telugu News