sumanth: ఈ సారి హిట్ ఖాయమంటోన్న హీరో

  • ఆసక్తికరమైన కథతో 'సుబ్రహ్మణ్య పురం'
  • ఈ తరహా కథను చేయడం ఇదే మొదటిసారి 
  • అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది    

కెరియర్ ను మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా సుమంత్ వైవిధ్యభరితమైన సినిమాలనే చేస్తూ వచ్చాడు. అయితే ఆ సినిమాల్లో ఆశించిన స్థాయిలో విజయాలను అందుకున్నవి చాలా తక్కువ. అయినా ఆయన విభిన్నమైన కథల వైపే మొగ్గుచూపుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'సుబ్రహ్మణ్య పురం' నిర్మితమైంది. సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథ ఇది.

నాస్తికుడైన హీరో .. ఆలయం నేపథ్యంలో జరిగే సంఘటనలపై పరిశోధన జరిపే క్రమంలో ఆయనకి ఎలాంటి అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతాయి? అనే దిశగా కథ కొనసాగుతుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చేనెల 7వ తేదీన విడుదల కానుంది.

ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ .. "నా కెరియర్లో ఈ తరహా సినిమా చేయడం ఇదే మొదటిసారి .. ఈ పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది .. ఈ సారి తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకం ఉంది" అని చెప్పాడు.    

sumanth
eesha rebba
  • Loading...

More Telugu News