Tiruvalluru: తమిళనాడు నుంచి వచ్చి... ఏపీలో ప్రేమజంట ఆత్మహత్య!

  • తిరువళ్లూరు ప్రాంతానికి చెందిన మౌనీషా, హేమ చంద్ర 
  • కుప్పం స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య
  • కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు

తమిళనాడుకు చెందిన ఓ ప్రేమ జంట, ఏపీకి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లా కుప్పం స్టేషన్ లో రైలు కింద విగతజీవులుగా కనిపించిన జంటను గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి, మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలించారు. వీరిద్దరూ తిరువళ్లూరుకు చెందిన జీఎస్ మౌనీషా, హేమచంద్రలుగా గుర్తించారు.

మౌనీషా తిరువళ్లూర్ యూనివర్శిటీలో బీఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతున్నట్టు గుర్తింపు కార్డు లభించింది. దీంతో వారిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉండివుండవచ్చని, తామిక కలసి వుండలేమన్న భావనతో కుప్పంకు వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చామని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని అధికారులు తెలిపారు.

Tiruvalluru
Kuppam
Love
Couple
Sucide
Police
  • Loading...

More Telugu News