Rahul Gandhi: మీ నాన్న, తాతల గోత్రం చెప్పుండాల్సింది: రాహుల్ పై వసుంధరా రాజే సంచలన వ్యాఖ్యలు

  • తాను దత్తాత్రేయ గోత్రీకుడినని చెప్పిన రాహుల్
  • నానమ్మ తండ్రి గోత్రం ఎలా చెబుతారన్న వసుంధరా రాజే
  • ఫిరోజ్ గోత్రం ఏంటో చెప్పాలని డిమాండ్

ఇటీవల రాహుల్ గాంధీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వేళ, పుష్కర్ బ్రహ్మ ఆలయంలో తాను దత్తాత్రేయ గోత్రీకుడినని చెప్పడాన్ని ఆ రాష్ట్ర సీఎం వసుంధరా రాజే
తప్పుబట్టారు. రాహుల్ ఆయన నానమ్మ తండ్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ గోత్రాన్ని చెప్పుకున్నారని, అది సంప్రదాయమా? అని ఆమె ప్రశ్నించారు. జైపూర్ లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆమె, రాహుల్ తన గోత్రం ఏంటో చెప్పలేదని ఎద్దేవా చేశారు. తన తండ్రి రాజీవ్ గాంధీ గోత్రమేమిటో, తన తాత ఫిరోజ్ గోత్రం ఏమిటో చెప్పుండాల్సిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయన ఎందుకు తన తండ్రి, తాత గోత్రాలు చెప్పలేదో తనకు తెలియడం లేదని అన్నారు.

Rahul Gandhi
Vasundhara Raje
Gotram
  • Loading...

More Telugu News