Purandeshwari: కూకట్ పల్లిలో నందమూరి సుహాసినికి వ్యతిరేకంగా పురందేశ్వరి ప్రచారం... టీడీపీ వర్గాల్లో కలకలం!

  • మాధవరం కాంతారావుకు మద్దతుగా ప్రచారం
  • ఓపెన్ టాప్ జీప్ లో రోడ్ షో
  • టీడీపీ, కాంగ్రెస్ ఎలా కలుస్తాయని ప్రశ్న
  • కాంతారావును గెలిపించాలని వినతి

తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా, కూకట్‌ పల్లి నియోజకవర్గం నుంచి ప్రజా కూటమి తరఫున టీడీపీ నుంచి బరిలోకి దిగిన నందమూరి సుహాసిని ప్రత్యర్థి తరఫున కేంద్ర మాజీమంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి ప్రచారం నిర్వహించడం తెలుగుదేశం వర్గాల్లో ఒకింత కలకలాన్ని రేపింది. కూకట్‌ పల్లి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాధవరం కాంతారావుకు మద్దతుగా నిలిచిన ఆమె, ఆయనతో కలసి ఓపెన్ టాప్ జీప్ లో వసంతనగర్ నుంచి మూసాపేట్ వరకు రోడ్ షో నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో మాధవరం కాంతారావును గెలిపిస్తే, స్థానికంగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని వ్యాఖ్యానించారు. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి కూకట్ పల్లిలో ఉందని, ఇళ్లలోకి మురుగునీరు వస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. తెదేపా, కాంగ్రెస్‌ ఎలా కలుస్తాయని ప్రశ్నించిన ఆమె, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏ మాత్రం భావసారూప్యత లేని పార్టీలు కలిశాయని పురందేశ్వరి ఆరోపించారు.

Purandeshwari
Madhavaram Krishnarao
Kukatpalli
Nandamuri Suhasini
Telangana
Elections
Campaign
Road Show
  • Loading...

More Telugu News