Huawei Mate 20 Pro: 'ఆండ్రాయిడ్ 9.0 పై' ఓఎస్ సపోర్ట్ తో 'హువావే మేట్ 20 ప్రో' స్మార్ట్ ఫోన్ విడుదల!
- భారత మార్కెట్లో విడుదలైన 'హువావే మేట్ 20 ప్రో'
- 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ధర రూ.69,990
చైనా మొబైల్ దిగ్గజ సంస్థ హువావే తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. హువావే మేట్ 20 ప్రో పేరిట విడుదలైన ఈ ఫోన్ లో 'ఆండ్రాయిడ్ 9.0 పై' ఓఎస్ తో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ లో పని చేసే మూడు కెమెరాలని ఏర్పాటు చేశారు. అధునాతన కీరిన్ 980 ప్రాసెసర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి ప్రత్యేకతలున్న ఈ ఫోన్ ధర రూ.69,990గా ఉంది. అమెజాన్ లో ప్రత్యేకంగా విక్రయించనున్న ఈ ఫోన్ 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకి వచ్చే నెల 3 నుండి లభ్యం కానుండగా, సాధారణ సభ్యులకి మరుసటి రోజు నుండి అందుబాటులోకి రానుంది. అలాగే, డిసెంబర్ 10 నుండి క్రోమా స్టోర్లలో కూడా లభించనున్నాయి.
హువావే మేట్ 20 ప్రో ప్రత్యేకతలు:
- ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టం
- 40/20/8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
- 6.39" క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (1440 x 3120 పిక్సల్స్)
- కీరిన్ 980 ప్రాసెసర్
- 6/8 జీబీ ర్యామ్,128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్, సూపర్ చార్జ్