jason momoa: 'సముద్ర పుత్రుడు' సాహస విన్యాసాలు

  • సముద్రం నేపథ్యంలో సాగే కథ 
  • ఆశ్చర్యచకితులను చేసే గ్రాఫిక్స్ 
  • డిసెంబర్లో భారీ స్థాయి విడుదల    

వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించే హాలీవుడ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఈ కారణంగానే తెలుగులోను హాలీవుడ్ చిత్రాలు పెద్ద సంఖ్యలో విడుదలవుతుంటాయి. అలా తెరపైకి దూసుకొచ్చిన ఎన్నో హాలీవుడ్ చిత్రాలు అనూహ్యమైన విజయాలను అందుకున్నాయి. దాంతో 'ఆక్వామేన్ అనే హాలీవుడ్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.

జేమ్స్ మామ్ .. అంబర్ హియర్డ్ .. పాట్రిక్ విల్సన్ తదితరులు నటించిన ఈ సినిమాకి, జేమ్స్ వాన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అద్భుతమైన విజువల్స్ తో ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సముద్రం నేపథ్యంలో సాగే కథ ఆశ్చర్యచకితులను చేస్తోంది. డిసెంబర్ 14న ఈ సినిమా ఇంగ్లిష్ తోపాటు హిందీ .. తమిళ .. తెలుగు భాషా ప్రేక్షకుల ముందుకు రానుంది. కథా వస్తువు పరంగాను .. గ్రాఫిక్స్ పరంగాను మంత్రముగ్ధులను చేస్తోన్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

jason momoa
amber heard
  • Error fetching data: Network response was not ok

More Telugu News